హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

5 వేల చాక్లెట్లతో అమ్మవారికి అలంకరణ

NDL: దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పాణ్యం అయ్యప్పరెడ్డి కాలనీలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని 5 వేల చాక్లెట్లతో అలంకరించారు. ఉత్సవాల మొదటి రోజు బాలాత్రిపుర సుందరిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. చాక్లెట్ల అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.