ఎన్టీఆర్ జిల్లా తిరువూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు ఆందోళన చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం 27వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వీఆర్ఏలు దీక్షా శిబిరాన్ని నిర్వహించి, ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
తిరువూరులో 27వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్ష


