హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

14న విద్యుత్ అదాలత్ నిర్వహణ

KRNL: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 14న మంత్రాలయంలో విద్యుత్ అదాలత్ నిర్వహించనున్నట్లు కోసిగి విద్యుత్ శాఖ ఏఈ వీరేశ్ సోమవారం తెలిపారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. కోసిగి, మంత్రాలయం, కౌతాళం, పెద్దకడబూర్ మండలాల వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.