హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు

AKP: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గొలుగొండ మండలంలోని పప్పుశెట్టిపాలెం, చీడిగుమ్మల, గొలుగొండ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎస్ఐ పీ.రామారావు ఇవాళ సంయుక్తంగా సందర్శించారు. ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వసతులు, ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.