AKP: కోటవురట్ల ఎంపీడీవో కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయ విభాగం ఆధ్వర్యంలో ఇవాళ ఆర్గానిక్ కూరగాయల స్టాల్ ఏర్పాటు చేశారు. సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయల కొనుగోలుకు పలువురు ఆసక్తి చూపించారు. అధికారులు వీటిని కొనుగోలు చేశారు.సేంద్రియ ఎరువులతో పండించిన ఆకుకూరలు,కూరగాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని ప్రకృతి వ్యవసాయ విభాగం కోఆర్డినేటర్ రామలక్ష్మి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కోటవురట్ల ఆర్గానిక్ కూరగాయల స్టాల్


