హైదరాబాద్: 28°C
వార్తలు

మగ కచిడి చేప రూ.80 వేలు

AP: కోనసీమ జిల్లా పల్లిపాలెం ఫిషింగ్‌ హార్బర్‌కు మగ కచిడి చేప వచ్చింది. సముద్రంపై వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు ఈ చేప చిక్కింది. 24 కిలోలు ఉన్న ఈ చేపను నరసాపురానికి చెందిన వ్యాపారి రూ.80 వేలకు కొనుగోలు చేశారు. మగ కచిడి చేప ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. 'గోల్డెన్‌ ఫిష్‌'గా పిలుస్తారు. దీని పొట్ట భాగంతో ఆపరేషన్‌ సమయంలో కుట్లు వేసే ధారం తయారు చేస్తారు.