హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్జీలు స్వీకరించిన కలెక్టర్ ఆనంద్

ATP: అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక', రెవెన్యూ క్లినిక్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డీఆర్‌ఓ మలోల, ఇతర జిల్లా అధికారులు పాల్గొని వినతులను పరిశీలించారు.