SRD: కంగ్టి మండల పరిషత్‌లో ఈ నెల 15న మధ్యాహ్నం 2:00 గంటలకు సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు MPDO దయాకర్ రావు నేడుతెలిపారు. స్పెషలాఫీసర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి వివిధ శాఖల అధికారులు పూర్తి సమాచారం, ప్రగతి నివేదికలతో సకాలంలో హాజరు కావాలని ఆదేశించారు. సమావేశానికి ఒక్క రోజు ముందే 40 కాపీల ప్రగతి నివేదికలను కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
తెలంగాణ
ఈనెల 15 మండల సాధారణ సర్వసభ్య సమావేశం


