KRNL: మద్దికేర మండలం పెరవలి శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో దేవీ నవరాత్రుల రెండో రోజు భూదేవి అమ్మవారు గాయత్రీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పంచముఖాలు, అష్టభుజాలతో కమలంపై ఆసీనురాలైన అమ్మవారిని పూలమాలలు, పట్టువస్త్రాలతో అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాయత్రీ మంత్ర పఠనంలో భక్తులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గాయత్రీ దేవి అలంకరణలో భూదేవి అమ్మవారు


