హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ..

HNK: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని నేడు వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజరాజేశ్వర స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా కలకాలం సుఖ సంతోషాలతో, పాడి పంటలతో సమృద్ధిగా వర్ధిల్లాలని ఎమ్మెల్సీ ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక నేతలు ఉన్నారు.