హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరువు ప్రకటించి రైతులను ఆదుకోవాలి: సీపీఐ

మన్యం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులకు ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం అందించాలని సీపీఐ (ఎంఎల్) రెడ్‌స్టార్ జిల్లా కార్యదర్శి తోట జీవన్న డిమాండ్ చేశారు. సోమవారం పార్వతీపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరువుతో పంట దిగుబడులు తగ్గగా, బియ్యం, పప్పులు, కూరగాయలు, వంట నూనెల ధరలు పెరిగి సామాన్యులపై భారం పడుతోందన్నారు.