హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవికుమార్

MBNR: మహబూబ్‌నగర్‌లోని జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ కేఎస్ రవికుమార్ ఇండియన్ బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ పదవి లభించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో బాక్సింగ్ క్రీడ అభివృద్ధికి, యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.