హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదకరంగా ఎడ్లకట్ట వాగు బ్రిడ్జి

KMR: దోమకొండ నుంచి సంగమేశ్వర్ గ్రామానికి వెళ్లే మార్గంలోని ఎడ్లకట్ట వాగు బ్రిడ్జి సైడ్‌వాల్ పూర్తిగా ధ్వంసమైంది. దీంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ఏమాత్రం అదుపుతప్పినా వాగులో పడిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి సైడ్‌వాల్ నిర్మించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.