హైదరాబాద్: 28°C
తెలంగాణ

Hit TV కథనానికి స్పందన.. రోడ్డుకు తాత్కాలిక మరమ్మత్తులు

ADB: రూరల్ మండలంలోని పోచ్చర నుంచి రాంపూర్ వరకు రోడ్డు మార్గం గుంతల మయంగా మారి ఇబ్బందిగా మారిందని ఇటీవల HIT TVలో కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు స్పందించిన అధికారులు, నాయకులు రోడ్డు మార్గానికి మొరం వేసి తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టారు. రానున్న రోజుల్లో BT రోడ్డు వేయించి రోడ్డుకు శాశ్వత పరిష్కారం చూపనున్నట్లు గ్రామ సర్పంచ్ గంగన్న తెలిపారు.