PDPL: జైపూర్ మండలం ఇందారం X రోడ్డు వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ పెరుక అంజిబాబు(40) మృతి చెందారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఆయన మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. విధులు ముగించుకుని బైక్పై ఇంటికి వెళ్తుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రి కి తరలించగా మృతి చెందాడు.
తెలంగాణ
లారీ ఢీకొని కానిస్టేబుల్ మృతి


