PLD: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పత్తి పనుల కోసం కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో అల్లావి (40) అనే మహిళ మృతి చెందగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ ఘటన సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కొండమోడు గ్రామానికి చెందిన కూలీలు పత్తి తీసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఆంధ్రప్రదేశ్
కూలీల ఆటో బోల్తా.. మహిళ మృతి


