హైదరాబాద్: 28°C
వార్తలు

స్వదేశీ ఆవిష్కరణలపై ఆర్మీ చీఫ్ హర్షం

ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ బెంగళూరులోని 515 ఆర్మీ బేస్ వర్క్‌షాప్‌ను సందర్శించారు. డ్రోన్ల అభివృద్ధి, క్వాంటం, స్పేస్ టెక్నాలజీ వంటి స్వదేశీ ఆవిష్కరణలను పరిశీలించారు. ఆయుధ సంపత్తిని పెంచుకునే చర్యలపై హర్షం వ్యక్తం చేశారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా, పరిశ్రమలు, విద్యాసంస్థల భాగస్వామ్యంతో ఆర్మీని భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్లుగా సిద్ధం చేయాలని ఆయన సూచించారు.