హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూపతిపూర్‌లో భక్తిశ్రద్ధలతో 5వ గిరిప్రదక్షిణ

JGL: భూపతిపూర్ నక్కలగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి గుట్ట చుట్టూ సోమవారం 5వ గిరిప్రదక్షిణ వైభవంగా జరిగింది. స్వామివారి అవతారమైన స్వాతి నక్షత్రం సందర్భంగా అర్చకులు వెంకటరమణ, కృష్ణల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిప్రదక్షిణ వ్యవస్థాపకుడు గోనె రాములు, భక్తులు ధర్మగ్రంథాలను తలపై ఉంచుకుని గోవింద నామస్మరణ చేస్తూ గుట్టకు ప్రదక్షిణ చేశారు.