PLD: నరసరావుపేట పట్టణంలో పఠాన్ జాహిరుద్దీన్ అనే యువకుడిపై నలుగురు యువకులు దాడి చేసినట్లు బాధితుడు తెలిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జాహిరుద్దీన్‌ను అతడి స్నేహితులు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై స్పందించిన నరసరావుపేట ఒకటవ పట్టణ పోలీసులు బాధితుడి నుంచి ఫిర్యాదు స్వీకరించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
యువకుడిపై నలుగురి దాడి


