హైదరాబాద్: 28°C
వార్తలు

5 రాష్ట్రాల్లోనే సగానికి పైగా బాల్య వివాహాలు!

బాల్య వివాహాల నిర్మూలనలో భారత్ ముందుకెళ్తున్నా, వాస్తవ పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి. 2030 నాటికి వీటిని అంతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ప్రపంచంలో జరిగే ప్రతి 3 బాల్య వివాహాల్లో ఒకటి భారత్‌లోనే జరుగుతోంది. యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల్లోనే సగానికి పైగా పెళ్లిళ్లు జరుగుతున్నాయని నిపుణులు వెల్లడించారు.