హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పదవులపై ఉత్కంఠ

పార్వతీపురం, సాలూరు మున్సిపల్ చైర్‌పర్సన్ పదవిని జనరల్‌ కేటగిరీకి కేటాయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రిజర్వేషన్‌పై స్పష్టత వస్తే తమ పార్టీల తరఫున ఎవరిని బరిలోకి దించాలనే అంశంపై ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆశావహులు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తుంది.