హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయంలో గాయత్రీదేవిగా అమ్మవారు

W.G: శరన్నవరాత్రి వేడుకలు ఆచంట మండలంలో ఘనంగా జరుగుతున్నాయి. ప్రసిద్ధిగాంచిన ఆచంటేశ్వర స్వామి వారి ఆలయంలో పార్వతీ అమ్మవారు సోమవారం గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని విశేష పూజలు నిర్వహించారు. వల్లూరు, కొడమంచిలి, ఏ వేమవరం, పెనుమంచిలి గ్రామాల్లో ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి శరన్నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నారు.