హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదం.. క్రేన్‌ను ఢీకొన్న బొలేరో

అన్నమయ్య జిల్లాలోని పీలేరు మదనపల్లె–తిరుపతి జాతీయ రహదారిపై ఆర్డీవో కార్యాలయం సమీపంలో క్రేన్‌ను బొలెరో పికప్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు రక్తగాయాలయ్యాయి. హైవే సిబ్బంది క్షతగాత్రుడిని అంబులెన్స్‌లో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాహనం ముందు భాగం దెబ్బతినగా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా రోడ్డు పక్కకు తొలగించారు.