హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళలపై దాడులకు వ్యతిరేకంగా పోరాడాలి

WGL: మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక దాడులు, అణచివేతలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ నాయకురాలు వి. సంధ్య పిలుపునిచ్చారు. ఆదివారం నర్సంపేట పట్టణంలో పూలక్క సంతాప సభలో మాట్లాడుతూ మహిళా ఉద్యమానికి ఆమె మరణం తీరని లోటని పేర్కొన్నారు. పూలక్క ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు.