హైదరాబాద్: 28°C
వార్తలు

ఏటీఎంలను టార్గెట్ చేస్తున్న దొంగల ముఠా

TG: ATMలను టార్గెట్ చేస్తున్న ఓ దొంగల ముఠా కొత్త రీతిలో చోరీలకు పాల్పడుతోంది. నైటీలు, చుడీదార్లు ధరించి, ముఖాలకు ముసుగులు వేసుకుంటూ గ్యాస్ కట్టర్లతో మిషన్లను కట్ చేసి నగదు దోచుకెళ్తున్నారు. కరీంనగర్ జిల్లా దుర్శేడు, తిమ్మాపూర్‌తో పాటు కామారెడ్డి జిల్లా గాంధారిలోనూ ఇలాంటి చోరీలు జరిగాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.