హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులపై నేడు సమీక్ష?

TG: ఎల్‌నినో పరిస్థితులు, కరవు ప్రభావంపై ఇవాళ ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించనుంది. సీఎం రేవంత్ నేతృత్వంలో మంత్రులు, అధికారులు ఈ భేటీలో పాల్గొంటారు. లోటు వర్షపాతం, సాగు-తాగునీటి ఎద్దడి తదితర అంశాలపై చర్చించి, కేంద్రానికి నివేదిక అందజేయనున్నారు. ప్రస్తుతం సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు ఢిల్లీలోనే అందుబాటులో ఉన్నారు.