హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జిల్లాలో స్పెషల్ టెట్ పరీక్షకు 96.8% హాజరు'

అన్నమయ్య జిల్లాలో ఇవాళ నిర్వహించిన ఏపీ స్పెషల్ టెట్ Session-I పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని DEO సుబ్రమణ్యం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2 కేంద్రాల్లో 220 మంది అభ్యర్థులకుగాను 213 మంది హాజరయ్యారు. మదనపల్లె పుంగనూరు రోడ్ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో 120 మందికి 117 మంది, శ్రీసాయి ఇనిస్టిట్యూట్‌లో 100 మందికి 96 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. 7 మంది గైర్హాజరయ్యారన్నారు.