హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లయన్స్ క్లబ్‌ చే కంటి వైద్యశిబిరం

CTR: పట్టణంలోని లయన్స్ క్లబ్‌ చే కంటి వైద్యశిబిరం నిర్వహించారు. ఆదివారం స్థానిక బిఎంఎస్‌క్లబ్‌లో జరిగిన శిబిరానికి 112 మంది కంటి జబ్బులు కలిగిన వారు హాజరైయ్యారు. చెన్నైకి చెందిన శంకర్‌నేత్రాలయ వారిచే చికిత్సలు నిర్వహించారు. 57 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేయగా, 21 మందికి కంటి అద్దాలు పంపిణీ చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.