హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోరంట్ల మండల కేంద్రంలో రూ.5లకే భోజనం

సత్యసాయి: గోరంట్ల మండల కేంద్రంలో నిరుపేదల కోసం మంత్రి సవిత సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ ద్వారా 6వ రోజు రూ.5 లకే భోజనం అందించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు స్వయంగా పాల్గొని ప్రజలకు, నిరుపేదలకు భోజనాన్ని వడ్డించారు. పేదల ఆకలి తీర్చడమే ధ్యేయంగా ఈ క్యాంటీన్ సేవలు నిరంతరం కొనసాగుతాయని పార్టీ శ్రేణులు తెలిపారు.