సత్యసాయి: ధర్మవరంలో బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన సాకే నరసింహులు, బనియన్ నరేష్‌లకు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ రూ. 50 వేల చొప్పున జరిమానా విధించినట్లు సీఐ రెడ్డప్ప తెలిపారు. ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నేరస్తులపై నిఘా ఉంచామన్నారు. నిబంధనలు మీరితే పీడీ యాక్ట్, జిల్లా బహిష్కరణ వంటి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
బైండోవర్ ఉల్లంఘించిన ఇద్దరికి రూ. 50 వేల జరిమానా


