ప్రధాని మోదీకి నటుడు ప్రకాష్ రాజ్ హెచ్చరిక జారీ చేశారు. దేశంలో నిరసనలను అణచివేసే ప్రయత్నాలు చేస్తే ప్రతి ఇల్లూ జంతర్ మంతర్‌గా మారుతుందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన తెలిపే హక్కును కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రజల గొంతును అణచివేయలేరని, ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని ఆయన పేర్కొన్నారు.
వార్తలు
ప్రతి ఇల్లూ జంతర్ మంతర్ అవుతుంది: ప్రకాష్ రాజ్


