W.G: అన్ని మతాలను గౌరవిస్తూ సోదరభావంతో మెలగాలని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం తణుకులో కొత్తగా నిర్మించిన లూథరన్ చర్చిని ఆయన ప్రారంభించారు. శాంతి, ఐక్యత, సమన్వయంతో పట్టణాభివృద్ధికి కృషి చేద్దామని, ఆధ్యాత్మికత సమాజంలో సోదరభావాన్ని పెంపొందిస్తుందని స్పష్టం చేశారు. ఈ వేడుకలో నాయకులు, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మతసామరస్యంతోనే ప్రగతి: ఎమ్మెల్యే


