దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి కొనసాగుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీలో నిన్న 40 వేల మంది భద్రతా బలగాలను మోహరించడం యువత ఆందోళనల పట్ల ప్రభుత్వ భయానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
వార్తలు
యువత ఆందోళనలంటే ప్రభుత్వానికి భయం: ఖర్గే


