హైదరాబాద్: 28°C
తెలంగాణ

గిరిజన విద్యార్థినికి కేటీఆర్ ఆర్థిక సాయం

MLG: తాడ్వాయి మండలం వీరాపూర్‌కు చెందిన గిరిజన విద్యార్థిని పెనుక శృతి కొడంగల్ అగ్రికల్చరల్ కాలేజీలో బీఎస్సీ సీటు సాధించింది. ఆర్థిక ఇబ్బందులతో చదువు కొనసాగించలేక ఎక్స్ వేదికగా సాయం కోరగా, స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు శృతి కుటుంబాన్ని కలిసి ఆదివారం సాయం అందజేశారు.