AP: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల సందర్భంగా సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తూ టీటీడీ అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు చేసింది. ఈనెల 20వ తేదీ వరకు ఎలాంటి ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు ఉండవని చెప్పింది. స్వయంగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులు మినహా, VIP బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలను స్వీకరించమని వెల్లడించింది.
వార్తలు
తిరుమలలో వీఐపీ సిఫార్సు లేఖలు బంద్


