హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫ్యాక్టరీ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి

KMM: వేంసూరు మండలం కల్లూరు గూడెం పామాయిల్ ఫ్యాక్టరీ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పనులు వేగవంతం చేసి ఈ నెల చివరకల్లా ఫ్యాక్టరీ నిర్మాణపు పనులు పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ఫడ్ అధికారులు పాల్గొన్నారు.