హైదరాబాద్: 28°C
వార్తలు

15 వేల సిమెంట్ బస్తాలతో దుర్గామాత ఆకృతి

దసరా నవరాత్రుల సందర్భంగా అదానీ సిమెంట్ యాజమాన్యం అమ్మవారిని అరుదైన రీతిలో పూజించారు. మధ్యప్రదేశ్‌ కైమోర్ ప్లాంట్ వద్ద 70x70 అడుగుల కాన్వాస్‌పై 15 వేల అంబుజా, ఏసీసీ సిమెంట్ బస్తాలతో(750 టన్నులు) దుర్గామాత భారీ ఆకృతిని తీర్చిదిద్దింది. 'జహా విశ్వాస్, వహా శక్తి' క్యాంపెయిన్‌లో భాగంగా కార్మికులు ఎంతగానో శ్రమించి ఈ అద్భుత కళాకృతిని రూపొందించారు.