NLG: మిర్యాలగూడ పట్టణంలోని ఇస్లాంపుర ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక చెప్పుల దుకాణం ఉన్న భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పై అంతస్తుల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బయటకు వచ్చే మార్గం లేక ఐదుగురు కుటుంబ సభ్యులు లోపలే చిక్కుకుపోయారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంటల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా కాపాడారు.
తెలంగాణ
మిర్యాలగూడలో భారీ అగ్నిప్రమాదం


