హైదరాబాద్: 28°C
తెలంగాణ

షాద్‌నగర్‌లో వైభవంగా దేవీ నవరాత్రులు ప్రారంభం

RR: షాద్‌నగర్ బైపాస్ రోడ్డులోని రుద్రాక్ష శివ హనుమాన్ దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. తొలిరోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలన్నారు.