హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలా త్రిపుర సుందరి దేవిగా ఉజ్జయిని అమ్మవారు

HYD: సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో వంగ అంబుజా తెలిపారు. మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారణలో భక్తులకు దర్శనమిచ్చారు. పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.