హైదరాబాద్: 28°C
తెలంగాణ

బకాయిలు రాక.. ఉస్మానియాలో నిలిచిన గుండె చికిత్సలు

HYD: ఉస్మానియా ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ బకాయిలతో స్టెంట్లు, పేస్మేకర్లు, ప్రాణరక్షక మందుల సరఫరా నిలిచిపోయింది. 2 నెలలుగా యాంజియోగ్రామ్ పేద రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సుమారు రూ.50 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో సరఫరాదారులు వెనక్కి తగ్గినట్లు సమాచారం. బకాయిలు విడుదల చేయకపోతే ఈనెల 12 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని జూనియర్ వైద్యులు హెచ్చరించారు.