హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముద్దాపురం స్టేజి వద్ద కారు–ట్రాక్టర్ ఢీ

BHNG: వలిగొండ మండలం ముద్దాపురం స్టేజి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చిట్యాల మండలం వనిపాల గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ మల్లెబోయిన లింగస్వామి జాతీయ రహదారిని దాటుతుండగా, వెలుగొండ వైపు నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ పల్టీ కొట్టి డ్రైవర్‌కు గాయాలయ్యాయి. కారు ముందు భాగం దెబ్బతింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.