హైదరాబాద్: 28°C
తెలంగాణ

శివలింగాపురంలో సీసీ రోడ్డు, డ్రైన్ ప్రారంభం

BDK: మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని శివలింగాపురంలో ఆదివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్‌వాడీ కేంద్రం వద్ద రూ.25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, సైడ్‌ డ్రైన్‌ను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. రహదారి సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు మురుగునీటి సమస్య తగ్గుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.