KMR: కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పాలియేటివ్ కేర్ దినోత్సవం వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పండ్లు పంపిణీ చేశారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగితో ఆప్యాయంగా మాట్లాడితేనే సగం వ్యాధి నయం అవుతుందని DHMO డాక్టర్. వెంకట్ తెలిపారు. రోగుల మానసిక వేదనను తగ్గించడంలో వైద్యులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
తెలంగాణ
ప్రభుత్వ ఆసుపత్రిలో పాలియేటివ్ కేర్ దినోత్సవం


