సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడెంలో మంచినీటి పైప్ లైన్ లీకేజీతో నీరు వృథాగా పోతోంది. లీకేజీని అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
పైప్ లైన్ లీకేజీతో తాగునీరు వృథా


