హైదరాబాద్: 28°C
తెలంగాణ

అగ్ని ప్రమాదంలో చెరకు తోట దగ్ధం

KMM: ప్రమాదవశాత్తు చెరుకు తోట కాలిపోయిన ఘటన కూసుమంచి మండలం గట్టుసింగారంలో చోటుచేసుకుంది. గోరీలపాడు తండాకు చెందిన బానోతు రవి నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని చెరకు సాగుచేస్తున్నారు. పొలంలో ఉన్న విద్యుతు లైన్ నుంచి నిప్పురవ్వలు రాలడంతో తోటకు నిప్పంటుకొని ఉంటుందని భావిస్తున్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో ఫైర్ సిబ్బంది చేరుకొని అదుపులోకి తెచ్చారు.