హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్య ఆరోగ్య శాఖలో జాబ్ నోటిఫికేషన్

గద్వాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ 48 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. పల్లె దవాఖాన ఎంఎల్‌హెచ్‌పీ 18, స్టాఫ్ నర్స్ 5, ఫార్మసిస్ట్ 5, ల్యాబ్ టెక్నీషియన్ 4, పీడియాట్రిషియన్ 3 తదితర పోస్టులున్నాయి. వయోపరిమితి 18–44 ఏళ్లు. ఆఫ్‌లైన్ దరఖాస్తు రుసుము ఎస్సీ/ఎస్టీలకు రూ.300, ఇతరులకు రూ.500. చివరి తేదీ అక్టోబర్ 13. అర్హత మార్కులకు 90% వెయిటేజీ.