JGL: మెట్‌పల్లి పట్టణంలోని అయ్యప్ప ఆలయం సమీపంలో జాతీయ రహదారిపై శనివారం జరిగిన ప్రమాదంలో సామల శకుంతల (55) మృతి చెందారు. ఇబ్రహీంపట్నానికి చెందిన శకుంతల, భర్త శంకరుతో కలిసి ద్విచక్ర వాహనంపై జగిత్యాలకు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో శకుంతల మృతి చెందగా, శంకరుకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి


