హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాగులకట్ట మలుపు వద్ద ప్రమాద భయం

WNP: శ్రీరంగాపూర్ మండలం తాటిపాముల నుంచి కంచిరావుపల్లికి వెళ్లే రహదారిలో నాగులకట్ట మలుపు వద్ద చెట్లు, పొదలు అడ్డుగా ఉన్నాయి. దెబ్బతిన్న బీటీ రోడ్డుపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాల ముప్పు నెలకొంది. అధికారులు స్పందించి చెట్లు, పొదలు తొలగించి, రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.