హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 12న అండర్‌-14 క్రికెట్‌ జట్టు ఎంపికలు

NZB: నిజామాబాద్‌లోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల మైదానంలో ఈ నెల 12న అండర్-14 బాలుర జిల్లా క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు తెలిపారు. 2012 సెప్టెంబర్ 1 నుంచి 2014 ఆగస్టు 31 మధ్య జన్మించిన క్రీడాకారులు  అర్హులని క్రికెట్ సంఘం ప్రతినిధులు వెల్లడించారు. ఆసక్తిగల క్రీడాకారులు తమ వయస్సు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని కోరారు.